చెప్పుల్లో కెమెరా పెట్టి అమ్మాయిల‌ ఫొటోలు తీసిన యువకుడి అరెస్టు!

11-01-2018 Thu 12:56 | National
  • కేరళ కల్సోత్సవంలో పట్టుబడిన యువకుడు
  • పదేపదే కాలు వైపుకి చూస్తుండటంతో అనుమానం
  • ఇంత తెలివైన ప‌ని త‌మ కెరీర్లో చూడ‌లేద‌న్న పోలీసులు
పైశాచిక బుద్ధికి టెక్నాల‌జీ తోడైతే ఎలా ఉంటుందో కేర‌ళ‌కు చెందిన ఓ యువ‌కుడు చూపించాడు. అమ్మాయిల ఫొటోలను వారికి తెలియ‌కుండా అశ్లీలంగా తీసేందుకు ఆ యువ‌కుడు చేసిన ప‌ని చూసి పోలీసులే ఆశ్చ‌ర్య‌పోయారు. చెప్పులో సెల్‌ఫోన్ పెట్టి, దాని కెమెరా ద్వారా అమ్మాయిల ఫొటోల‌ను అస‌భ్య‌కోణంలో తీసేందుకు ప్ర‌య‌త్నించిన యువ‌కుడిని పోలీసులు అరెస్టు చేశారు.

కేర‌ళ‌లోని త్రిస్సూర్‌లో జ‌రుగుతున్న కేర‌ళ క‌ల్సోత్స‌వానికి వివిధ క‌ళాశాలల విద్యార్థినీ విద్యార్థులు హాజ‌ర‌య్యారు. వారిలో బైజు కూడా ఉన్నాడు. ఇత‌డు ప‌దేప‌దే కాళ్ల వైపు చూస్తుండటం, అమ్మాయిలు ఎక్కువ‌గా ఉన్న చోట్ల తిరుగుతుండ‌టం, కొన్నిసార్లు చెప్పులు అమ్మాయిలున్న చోట వదిలేసి, తను దూరంగా నిలబడి, అటు వైపే చూడడం చేస్తుండడంతో.. అక్క‌డ గ‌స్తీ కాస్తున్న‌ పోలీసుల‌కు అనుమానం వ‌చ్చి త‌మ‌దైన శైలిలో విచారించారు. అప్పుడు బైజు చెప్పిన విష‌యం విని వారికి దిమ్మ తిరిగింది.

త‌న కాలి చెప్పులో బైజు ఓ సెల్‌ఫోన్‌ను ఉంచాడు. కెమెరా పైకి క‌నిపించేలా చెప్పు రంధ్రంలో దానిని ఇమి‌డ్చాడు. ఎవ‌రైనా అనుకోకుండా త‌న కాలు తొక్కితే ఫోన్ పాడ‌వ‌కుండా ఉండేందుకు ఫోన్ చుట్టూ గ‌ట్టి స్టీల్ క‌వ‌రింగ్ కూడా చేయించాడు. ఒక‌వేళ ఫొటోలు తీసే ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోతే ప్ర‌త్యామ్నాయంగా మ‌రో ఫోన్‌ను సిద్ధంగా ఉంచుకున్నాడు. ఇంత తెలివిగా అమ్మాయిల ఫొటోలు తీసేందుకు బైజు చేసిన ప్ర‌య‌త్నం చూసి అక్క‌డి పోలీసులు ఆశ్చ‌ర్య‌పోయారు. త‌మ కెరీర్లో ఇలాంటి ప‌ని చూడ‌లేద‌ని వారు అన్నారు. ఫోన్లు స్వాధీనం చేసుకుని బైజుని అరెస్టు చేశారు.
shoeskeralaphotosbottom angle

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more